టాటా హ్యారియర్ ఫస్ట్ యాక్సిడెంట్: ఇదీ పరీస్థితి!

Wednesday, February 6, 2019 10:30 AM Automobiles
టాటా హ్యారియర్ ఫస్ట్ యాక్సిడెంట్: ఇదీ పరీస్థితి!

టాటా మోటార్స్ జనవరి 2019లో హ్యారియర్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. విడుదలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా హ్యారియర్‌ను కేవలం రూ. 12.69 లక్షల ధరకే విడుదల చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, విడుదలైన మూడు వారాల్లో టాటా హ్యారియర్ మొదటి రోడ్డు ప్రమాదం నమోదైంది.

అవును, దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నగరంలో టాటా హ్యారియర్ డెమో వెహికల్ రోడ్డు ప్రమాదానికి గురైంది. దేశీయంగా జరిగిన మొట్టమొదటి టాటా హ్యారియర్ యాక్సిడెంట్ కూడా ఇదే కావడం గమనార్హం. ముంబాయ్‌లోని కాన్కోర్డ్ ప్రభాదేవి టాటా షోరూమ్‌లోనే ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. షోరూములోనే స్టాక్ యార్డు నుండి కార్లను తరలిస్తున్నపుడు ఓ షోరూమ్ ఉద్యోగి పొరబాటున భారీ ఇనుప స్థంభాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. అయితే, ఫ్రంట్ బంపర్ మరియు బానెట్ మీద నొక్కులను చూస్తే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు.

టాటా మోటార్స్ ల్యాండ్ రోవర్ సంస్థకు చెందిన ఓమేగా ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో ధృడమైన శరీరం దీని సొంతం. అంతే కాకుండా మరెన్నో సేఫ్టీ ఫీచర్లను టాటా ఇందులో తప్పనిసరిగా అందించింది. సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ కెపాసిటి గల కైరోటెక్ డీజల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. 138బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ అనుసంధానం కలదు.

For All Tech Queries Please Click Here..!