రెనో కార్లపై లక్ష రూపాయల తగ్గింపు

Wednesday, July 10, 2019 04:24 PM Automobiles
రెనో కార్లపై లక్ష రూపాయల తగ్గింపు

రెనో కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. రెనో డస్టర్, క్యాప్చర్ మరియు క్విడ్ కార్ల మీద భారీ ఆఫర్లు ప్రకటించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఈ మధ్య కాలంలో భారీ నష్టాలను చవిచూసింది. చిన్న చిన్న కార్ల కంపెనీల నుండి మహామహ దిగ్గజాల వరకు దాదాపు అన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు తీవ్ర నష్టాలపాలయ్యాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు పలు కార్ల తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల మీద ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రెనో ఇండియా తాజాగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనో డీలర్ల వద్ద లభిస్తోంది. డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ కంటే మునుపటి మోడల్ డీజల్ వేరియంట్ మీద ఏకంగా రూ. 1.05 లక్షలు మరియు పెట్రోల్ వేరియంట్ మీద రూ. 35,000 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.   రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ మీద సుమారుగా రూ. 55,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. రెనో ఇండియా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మీద గరిష్టంగా రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. రెనో క్విడ్ 800సీసీ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

For All Tech Queries Please Click Here..!