రాంగ్ పార్కింగ్ చేశాడని పోలీసులు ఎంత పని చేశారో చూడండి..

Tuesday, April 2, 2019 01:58 PM Automobiles
రాంగ్ పార్కింగ్ చేశాడని పోలీసులు ఎంత పని చేశారో చూడండి..

డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ లాఠీతో రోడ్డు మీద పార్క్ చేసిన స్కూటర్‌ను ఇష్టమొచ్చినట్లుగా కొడుతూ ఓ వీడియోలో పట్టుబడ్డాడు. రోడ్డు పక్కన ఉన్న హోండా డియో స్కూటర్‌ను చూసిన పోలీస్ అధికారి తన వద్ద ఉన్న పెద్ద లాఠీ కర్రతో లైట్లు, డ్యాష్ బోర్డు మరియు బ్యాక్ లైట్ల మీద ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఇతని పై అధికారి ముందే ఇలా తన ప్రతాపం చూపించాడు.

స్కూటర్ ఉన్న ప్రదేశం నో పార్కింగ్ ఏరియా అని తెలుస్తోంది. అయినప్పటికీ రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, ఆ వాహనం మీద కేసు నమోదు చేసి, వాహన యజమానిని కోర్టుకు పంపించాల్సి ఉంటుంది. లేదంటే... ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన ప్రకారం జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ... ఈ ఇద్దరు పోలీసులు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పోలీసులు బాధ్యతారాహితంగా ప్రవర్తించారు.

ఇది గమనించిన స్కూటర్ యజమాని పోలీసులతో అనవసరపు వాదనలు చేయకుండా అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు. ఏదేమైనప్పటికీ... తప్పు చేసిన వారిని శిక్షించే విధానం ఇది కాదు. చెన్నైలో జరిగిన ఈ సంఘటనకు సంభందించిన ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. మీరు కూడా ఈ వీడియో మీద ఓ లుక్కేయండి..

For All Tech Queries Please Click Here..!