మరో కొత్త వేరియంట్లో టాటా టియాగో విడుదల: ధర మరియు ఇతర వివరాలు

Thursday, December 13, 2018 09:29 PM Automobiles
 మరో కొత్త వేరియంట్లో టాటా టియాగో విడుదల: ధర మరియు ఇతర వివరాలు

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ కారును మరో అదనపు వేరియంట్లో విడుదల చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎక్స్‌జడ్(XZ) వేరియంట్లోనే నూతన ఫీచర్లు మరియు అదనపు సొబగులను జోడించి ఎక్స్‌జడ్+(XZ+)పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా టియాగో ఎక్స్‌జడ్+ వేరియంట్ ధర రూ. 5.57 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

టాటా టియాగో ఎక్స్‌జడ్+ టాప్ ఎండ్ వేరియంట్ సరికొత్త కెన్యాన్ ఆరేంజ్ మరియు ఓషియన్ బ్లూ రంగులతో పాటు పలు ఆప్షనల్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ కూడా లభిస్తోంది. 15-అంగుళాల అళ్లాయ్ వీల్స్, టెయిల్ గేట్ మీద క్రోమ్ సొబగులు మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న బ్లాక్డ్ బ్లాక్ బెజెల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి ఎక్ట్సీరియర్ ఫీచర్లతో పాటు ఇంటీరియర్ లోపల ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్ రికగ్నిషన్ 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ కంట్రోల్ గల ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్  వంటివి ఉన్నాయి.

టాటా టియాగో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటి గల రివట్రాన్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ కెపాసిటి గల రివోటార్క్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో ఎంచుకోవచ్చు.