ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్

Wednesday, March 4, 2020 11:58 AM Automobiles
ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్

ఇండియన్ మార్కెట్లో జీప్ రాంగ్లర్ రూబికాన్ రూ. 68.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో ప్రారంభించబడింది. ఈ రాంగ్లర్ రూబికాన్ జీప్ డెలివరీలు 2020 మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ రాంగ్లర్ రూబికాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం, భారతదేశంలో ప్రారంభమైన రాంగ్లర్ రూబికాన్ యొక్క ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అదే విధంగా ఈ వాహనాల యొక్క డెలివరీలు కూడా త్వరలో ప్రారంభించనుంది. కొత్తగా విడుదలైన రాంగ్లర్ రూబికాన్ 5 డోర్స్ మోడల్.