యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్

Monday, March 9, 2020 12:19 PM Automobiles
యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్

భారతదేశపు అతిపెద్ద మోటార్ సైకిల్స్ ఎగుమతిదారు అయిన బజాజ్ ఆటో లిమిటెడ్ కంపెనీ బెంగుళూరుకి చెందిన ఎలిక్ట్రికల్ మొబిలిటీ షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యులు లో 8 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది, అంటే సుమారు రూ. 57.27 కోట్లు. బజాజ్ ఆటో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి ఎందుకు పెట్టింది అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ! సాధారణంగా యులు అద్దెకు ఎలక్ట్రిక్ సైకిల్స్ అందిస్తుంది. షేర్డ్ మైక్రో-మొబిలిటీ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ బజాజ్ ఆటో యులు కి అందిస్తుంది.