మహీంద్రా దశ తిరిగింది.. విడుదలైన నెలలోనే భారీ అమ్మకాలు

Monday, March 18, 2019 05:00 PM Automobiles
మహీంద్రా దశ తిరిగింది.. విడుదలైన నెలలోనే భారీ అమ్మకాలు

ఎస్‌యూవీ వాహనాల తయారీకి పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో విపణిలోకి సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహంచని విధంగా మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌కు భారీ స్పందని వచ్చింది. తొలి నెలలోనే ఏకంగా 13,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. అంతే కాకుండా మహీంద్రా ఎక్స్‌యూవీ300 వెయిటింగ్ పీరియడ్ మూడు వారాలు ఉన్నట్లు మహీంద్రా ప్రకటించింది. ఫిబ్రవరి 14, 2019 న విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ రూ. 7.90 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలకు ధీటైన పోటీనిస్తూ మహీంద్రా ఎక్స్‌యూవీ300 అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎనిమిది విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. W4, W6, W8 మరియు W8 ఆప్షనల్ ఈ నాలుగు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో 8 వేరియంట్లుగా అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 సాంకేతికంగా 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ 110బీహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా డీజల్ యూనిట్ గరిష్టంగా 115బీహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. డిమాండును బట్టి భవిష్యత్తులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించే అవకాశం ఉంది.

For All Tech Queries Please Click Here..!