ఇంతకీ మహీంద్రా మరాజొ సురక్షితమైన కారేనా...?

Sunday, December 9, 2018 12:00 PM Automobiles
ఇంతకీ మహీంద్రా మరాజొ సురక్షితమైన కారేనా...?

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విపణిలోకి సరికొత్త మరాజొ ఎమ్‌యూవీ(మల్టీ పర్పస్ వెహికల్)ను విపణిలోకి ప్రవేశపెట్టింది. మార్కెట్లోని ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, రెనో లాజీ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా మోడళ్లకు గట్టి పోటీనిచ్చే మహీంద్రా మరాజొ 7 మరియు 8 మంది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొత్త కార్లకు క్రాష్ పరీక్షలు నిర్వహించి, ప్రమాద తీవ్రత ఆధారంగా వాహనంలో ప్రయాణించే వారి మీద ప్రమాదం ఎలాంటి ప్రభావం చూపుతుంది మరియు ఆ కారు ఎంత వరకు సురక్షితమైనదని తేల్చే అంతర్జాతీయ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (NCAP) ఆధ్వర్యంలో మహీంద్రా తమ మరాజొ వాహనానికి సేఫ్టీ పరీక్షలు నిర్వహించింది. 

ఈ పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా 17కు 12.85 పాయింట్లు మరియు పిల్లల భద్రత పరంగా 49కి 22.22 పాయింట్లను సాధించింది. మొత్తం మీద మహీంద్రా మరాజొ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ పరీక్షల్లో ప్రయాణికుల సేఫ్టీ పరంగా ఐదు స్టార్లకు గాను 4 స్టార్లను సాధించింది. మహీంద్రా మరాజొ ఈ ఏడాది సెప్టెంబరులో రూ. 9.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదలయ్యింది.