జావా బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్న కస్టమర్లు.... ఏమైందంటే?

Tuesday, April 23, 2019 04:00 PM Automobiles
జావా బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్న కస్టమర్లు.... ఏమైందంటే?

ఇండియాలో అత్యంత పురాతమైణ బైకుల తయారీ సంస్థగా పేరుగాంచిన జావా మోటార్ సైకిల్స్‌ను దేశీయ ఆటోమోటివ్స్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహీంద్రా ద్వారా మళ్లీ పుట్టిన జావా మోటార్ సైకిల్స్ గత ఏడాది నవంబరులో జావా మరియు జావా 42 బైకులను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 30, 2019న తొలి జావా మోటార్ సైకిల్‌ను కస్టమర్‌కు డెలివరీ ఇచ్చింది.

చాలా మంది కస్టమర్లు జావా మోటార్ సైకిళ్ల డెలివరీకి సంభందించి ట్విట్టర్ వేదికగా తమ అసహనాన్ని వెలిబుచ్చారు. జావా కంపెనీ తమ బైకులను ఆవిష్కరించిన తొలి నాళ్లలో బుకింగ్ చేస్తే ఇంత వరకు డెలివరీ  ఇవ్వడంలేదని, అందుకు సంభందించి సంస్థ నుండి ఎలాంటి సమాచారం అందడం లేదని వాపోయారు. జావా మోటార్ సైకిల్స్ కార్యకలాపాలు సాగిస్తున్న క్లాసిక్ లెజెండ్స్ షోరూమ్స్ ఇప్పటి వరకు జావా బైకులకు వచ్చిన బుకింగ్స్ మరియు ప్రొడక్షన్‌కు సంభందించిన వివరాలను వెల్లడించలేదు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే... క్లాసిక్ లెజెండ్స్ దేశవ్యాప్తంగా ఇంకా బుకింగ్స్ స్వీకరిస్తోంది.

మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టేటప్పుడు సంస్థ తమ కస్టమర్లతో సత్సంభందాలు కొనసాగించాలి. జావా మోటార్‌సైకిల్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధానంగా గుర్తించాల్సిన వాటిలో కస్టమర్ల సందేహాలకు బదులివ్వడం అత్యంత కీలకం. ఓల్డ్ స్టైల్ క్లాసిక్ మోటార్ సైకిళ్లకు మంచి డిమాండ్ ఉన్న ఈ తరుణం జావా మోటార్ సైకిల్స్ చక్కగా రాణించేందుకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. జావా మోటార్ సైకిళ్లకు సంభందించి మీ అభిప్రాయాలను క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.

For All Tech Queries Please Click Here..!