రెండు బైకుల్లో సీబీఎస్ టెక్నాలజీ పరిచయం చేసిన హోండా

Thursday, March 14, 2019 12:09 PM Automobiles
రెండు బైకుల్లో సీబీఎస్ టెక్నాలజీ పరిచయం చేసిన హోండా

దేశీయ దిగ్గజ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ తమ డ్రీమ్ యుగా మరియు లివో కమ్యూటర్ బైకుల్లో సీబీఎస్ టెక్నాలజీని పరిచయం చేసింది. అంతే కాకుండా ఇటీవల తమ సీడీ 110 డ్రీమ్ బైకులో కూడా ఇది వరకే సీబీఎస్ సాంకేతికతను జోడించింది. దీంతో ప్రస్తుతం హోండా టూ వీలర్స్ ఇండియా లైనప్‌లో ఉన్న అన్ని 110సీసీ బైకుల్లో సీబీఎస్(కాంబి బ్రేకింగ్ సిస్టమ్) తప్పనిసరిగా అందించింది. 

నూతన భద్రతా ప్రమాణాల మేరకు అన్ని బైకుల్లో సీబీఎస్ టెక్నాలజీని తప్పనిసరి చేయడంతో హోండా తమ అన్ని 110సీసీ బైకుల్లో సీబీఎస్ ప్రవేశపెట్టింది. నూతన భద్రతా ప్రమాణాల మేరకు ఇంజన్ కెపాసిటీ 125సీసీ వరకు ఉన్న బైకుల్లో సీబీఎస్(కాంబి-బ్రేకింగ్ సిస్టమ్) మరియు 125సీసీ అంత కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకుల్లో ఏబీఎస్(యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) తప్పనిసరి. ఈ మేరకు ఇప్పటికే చాలా వరకు టూ వీలర్ల కంపెనీలు తమ అన్ని బైకుల్లో సీబీఎస్ మరియు ఏబీఎస్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి.

హోండా విడుదల చేసిన డ్రీమ్ యుగా సీబీఎస్ బైకులో ఇరువైపులా డ్రమ్ బ్రేకులు ఉన్న వేరియంట్ ధర రూ. 54,847 లు. సీబీఎస్ లేనటువంటి మునుపటి వేరియంట్‌తో పోల్చుకుంటే దీని రూ. 600 అధికంగా ఉంది. అదే విధంగా హోండా లివో సీబీఎస్ ధర రూ. 59,950 లు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

For All Tech Queries Please Click Here..!