నమ్మశక్యంగానీ మార్పులతో వచ్చిన హోండా ఆక్టివా 125 స్కూటర్

Friday, June 14, 2019 04:00 PM Automobiles
నమ్మశక్యంగానీ మార్పులతో  వచ్చిన హోండా ఆక్టివా 125 స్కూటర్

దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ తమ సరికొత్త యాక్టివా 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. హోండా ఆక్టివా స్కూటర్ ఎప్పటి నుండో మార్కెట్లో ఉంది కదా... ఇప్పుడు కొత్త ఆవిష్కరించడమేంటి అనుకుంటున్నారా..? మీ డౌట్ కూడా నిజమే.. కానీ హోండా అతి త్వరలో చేయనున్న ఈ ఆక్టివా 125 స్కూటర్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో పరిచయం చేస్తున్న అధునాతన టెక్నాలజీ, ఫీచర్లు మరియు ఫ్యూచర్‌కు ఎంతగానో ఉపయోగపడే ఇంజన్ ఇంకా ఎన్నో విశిష్టతలతో ఆవిష్కరించారు. వచ్చే సెప్టెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.

హోండా ఆక్టివా 125 స్కూటర్‌లో బిఎస్-6 ఇంజన్
భారత్ ప్రమాణాల ప్రకారం 2018 ఏప్రిల్ నుండి నూతన ఉద్గార ప్రణాలను పాటించే బిఎస్-4 ఇంజన్‌లు అన్ని టూ వీలర్లలో తప్పనిసరి అయ్యాయి. అయితే, వాహనాల నుండి విడుదలయ్యే కర్భన ఉద్గారాలు వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో తక్కువ ఉద్గారాలు ఉత్పత్తి చేసే ఇంజన్‌లను ప్రవేశపెట్టేందుకు భారత ప్రభుత్వం బిఎస్-6 ఇంజన్‌లను తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు వాహన తయారీ సంస్థలు  ముందుగానే బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను డెవలప్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే హోండా సంస్థ తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌లో బిఎస్-6 ఇంజన్‌ అందిస్తోంది.

ఏప్రిల్ 01, 2020 నాటికి అన్ని టూ వీలర్లలో బిఎస్-6 ఇంజన్‌లు తప్పనిసరి కావడంతో పలు దిగ్గజ సంస్థలు అత్యధికంగా విక్రయిస్తున్న తమ వాహనాలలో బిఎస్-6 ఇంజన్‌లను అందించేందుకు కసరత్తులు ప్రారంభించాయి. కాబట్టి కొత్త తరం హోండా ఆక్టివా 125 స్కూటర్‌లో వస్తున్న అతి పెద్ద మార్పు ఏదంటే బిఎస్-6 ఉద్గారణ ప్రమాణాలను పాటించే 125సీసీ ఇంజన్ అని చెప్పుకోవచ్చు.

హోండా టూ వీలర్స్ ఆవిష్కరించిన బిఎస్-6 ఆక్టివా స్కూటర్ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం బిఎస్-4 ఆక్టివా శైలిలోనే ఉంటుంది. కానీ అక్కడక్కడ క్రోమ్ సొబగులను చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇందులో వచ్చిన అదనపు ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. రీడైజన్ చేయబడిన అధునాతన అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంటేషన్ దీని సొంతం.

సాంకేతికంగా బిఎస్-6 హోండా ఆక్టివా 125 స్కూటర్‌లో 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే 125సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 8.4బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్ ఇందులోని మరో ప్రత్యేకత. ప్రస్తుతం ఉన్న దాదాపు అన్ని స్కూటర్లు, బైకుల్లో కార్బోరేటర్ సిస్టమ్ ద్వారా పెట్రోల్ ఇంజన్‌లోకి చేరుతుంది. కానీ ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ పెట్రోల్‌ను డైరక్ట్‌గా ఇంజన్ సిలిండర్‌లోకి పంపింగ్ చేస్తుంది. దీంతో అత్యధిక మైలేజ్‌తో పాటు ఇంధన నష్టం జరగదు. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ గల రెండవ భారతీయ స్కూటర్ హోండా ఆక్టివా 125, దేశీయ దిగ్గజం హీరో ఇప్పటికే తమ మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్లో ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టింది.

For All Tech Queries Please Click Here..!