కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

Thursday, March 12, 2020 11:17 AM Automobiles
కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న మోటర్ సైకిల్స్ లో కెటిఎమ్ బైక్ ఒకటి. ఇప్పుడు కెటిఎమ్ తన బ్రాండ్ అయిన డ్యూక్ 790 బైకుపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం, ! ఇప్పుడు కెటిఎమ్ డ్యూక్ 790 పై దాదాపు రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ మిగిలిఉన్న బిఎస్-4 మోడల్ బైకులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు అన్ని కంపెనీలు తమ వాహనాలను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంది.