ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన డామినర్ 250

Wednesday, March 11, 2020 04:49 PM Automobiles
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన డామినర్ 250

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో ఇప్పుడు డామినర్ 250 ని విడుదల చేసింది. బజాజ్ ఆటో విడుదల చేసిన ఈ బజాజ్ డామినర్ 250 బైక్ ధర రూ. 1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బజాజ్ యొక్క కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం, ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన బజాజ్ డామినార్ డి 250 బుకింగ్స్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు డామినార్ 250 భారతదేశంలో అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. బజాజ్ డామినార్ 250 మోటార్ సైకిల్స్ త్వరలో డెలివరీ కానున్నాయి.