రాష్ట్రంలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..

Saturday, May 31, 2025 07:05 AM Weather
రాష్ట్రంలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..

రానున్న మూడు రోజులు ఏపీలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5మిమీ, వైఎస్ఆర్ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 79.2మిమీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79మిమీ,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74మిమీ వర్షపాతం నమోదైంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: