అలెర్ట్: నేడు ఈ ప్రాంతాల్లో భానుడి భగభగలు
_(16)-1748880753.jpeg)
మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 నుండి 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే సమయంలో పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే తెలంగాణలో రెండు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడుతాయని చెప్పింది. అంతేకాకుండా రేపు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనునున్నాయి.