అలెర్ట్: ఈ రోజు బయటకు రాకండి
_(31)-1745343276.jpeg)
బుధవారం ఏపీలోని 39 మండలాల్లో తీవ్రవడగాలులు , 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా -7, విజయనగరం-17, పార్వతీపురంమన్యం -13, అల్లూరి సీతరామరాజు-2, గురువారం 17 మండలాల్లో తీవ్ర, 18 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఈ సీజన్లో అధిక ఉష్ణోగ్రత మంగళవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.9°C రికార్డ్ అయింది. వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 43.8°C, కర్నూలులో 43.5°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 42.9°C, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 42.8°C, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.4°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.8°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే 195 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు.
బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదు. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.