నేడు ఈ మండలాల వారు జాగ్రత్త
_(31)-1745173438.jpeg)
సోమవారం ఏపీలోని 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే 20 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం-4 విజయనగరం-16, పార్వతీపురం మన్యం-11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వెల్లడించారు. మంగళవారం 10 మండలాల్లో తీవ్ర,15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం-1, విజయనగరం-8, మన్యం-4, అల్లూరి-1, విశాఖ-1, అనకాపల్లి-5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆదివారం నంద్యాల జిల్లా ఔకు లో 42.6°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడు 42.5°C, నెల్లూరు జిల్లా మనుబోలు లో 42.4°C, పల్నాడు జిల్లా వినుకొండ,వైఎస్సార్ జిల్లా ఉప్పలూరు 42.2°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు. ఆకస్మాతుగా పిడుగులతో పడే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.