రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. అందరూ అప్రమత్తంగా ఉండండి
ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీనితో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో ఏపిలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

.jpg)

.jpg)