తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం
Wednesday, April 30, 2025 08:25 AM Weather
_(31)-1745950155.jpeg)
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళవారం రాత్రి 8 గంటల నాటికి కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 31మిమీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 22మిమీ, కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 20మిమీ వర్షపాతం రికార్డు అయ్యింది. మంగళవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41.8°C, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 41.5°C వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.3°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41°C, అల్లూరిసీతారామరాజు జిల్లా యెర్రంపేట,కర్నూలు జిల్లా లద్దగిరి, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 40.8°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: