WhatsApp Web Video Calls: వాట్స్‌యాప్ వెబ్ వీడియో కాల్స్ ఉచితంగా చేయడం ఎలా ? 

Saturday, October 31, 2020 04:15 PM Technology
WhatsApp Web Video Calls: వాట్స్‌యాప్ వెబ్ వీడియో కాల్స్ ఉచితంగా చేయడం ఎలా ? 

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో వాట్సాప్ (WhatsApp) మొదటి స్థానంలో ఉంది. వాట్స్‌యాప్ మెసేజులు పంపడానికే కాకుండా ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లు (WhatsApp Users) అందరూ ఉచితంగా ఆడియో కాల్స్ , వీడియో కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం డేటా కాని వైఫై కాని కావాల్సి ఉంటుంది. వాట్సాప్ సర్వీసు మాత్రమే మీరు ఉచితంగా పొందుతారు. ఈ శీర్షికలో వాట్స్ యాప్ వెబ్ వీడియో కాల్స్ (WhatsApp Web Video Calls) ఉచితంగా చేచడం ఎలాగో తెలుసుకుందాం. 

వాట్సాప్‌ వెబ్ ద్వారా వీడియో కాల్స్ (WhatsApp video call on pc) ఎలా చేయాలో ఓ సారి చూద్దాం.  
స్టెప్ 1: వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మీ యొక్క అకౌంటుతో లాగిన్ అవ్వండి. 
స్టెప్ 2: ఎడమవైపు పై భాగంలో గల నిలువు మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి. ఇందులో 'క్రీయేట్ రూమ్' క్లిక్ చేయండి. 
స్టెప్ 3: పాప్-అప్‌లో మెసెంజర్‌లో కొనసాగించు నొక్కడం ద్వారా ముందుకు సాగండి. గమనిక ఇది పనిచేయడానికి మీకు ఫేస్ బుక్ అకౌంట్ అవసరం లేదు. 
స్టెప్ 4: ఇప్పుడు క్రీయేట్ రూమ్ ను సృష్టించండి. దీని తరువాత వీడియో కాల్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది. 
స్టెప్ 5: వాట్సాప్‌లో వీడియో కాల్ లింక్‌ను ఇతరులతో షేర్ చేసుకొండి. 
స్టెప్ 6: నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ లేదా గ్రూపులో రూమ్ ని సృష్టించడానికి ఆ చాట్ విండోను ఓపెన్ చేసి అటాచ్మెంట్ చిహ్నాన్ని నొక్కండి.
 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!