ఇకపై వాట్సప్ లోనూ యాడ్స్
Monday, June 16, 2025 08:52 PM Technology

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాడ్స్ లేకుండా, ఉచితంగానే సేవలందించిన ఈ సంస్థ ఆదాయ ఆర్జనలో భాగంగా కొత్తగా ప్రకటనలకు శ్రీకారం చుడుతోంది.
ఇకపై యాప్ లోని అప్డేట్స్ ట్యాబ్ లో అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించిన ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్ లో వాట్సప్ పేర్కొంది. దీంతో ఇక నుండి వాట్సప్ యూజర్లకు కూడా యాడ్స్ తిప్పలు తప్పవు అనమాట.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: