ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో ముందడుగు
Tuesday, August 12, 2025 10:25 PM Sports
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసులో కీలక ముందడుగు పడింది. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ధోనీ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే సీఎస్కేపై ఐపీఎల్ రెండేళ్ల పాటు బ్యాన్ కూడా విధించింది. ఈ వ్యవహారంలోకి ఎంఎస్ ధోనీ పేరును లాగడంపై ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)