కోహ్లిపై ఫిర్యాదు.. అల్లు అర్జున్ పరిస్థితే వస్తుందా..?
Saturday, June 7, 2025 09:18 AM Sports
బెంగళూర్ తొక్కిసలాట ఘటనలో బెంగళూర్ జట్టు యాజమాన్యంపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా RCB ప్లేయర్ విరాట్ కోహ్లిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ అంటూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో కోహ్లిపై కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పరిస్థితే కోహ్లీకి కూడా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



