ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: జగన్
Tuesday, August 12, 2025 09:45 PM Politics
చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని ఫైరయ్యారు. చంద్రబాబు గుండాలా అరాచకాలు చేశారని, రౌడీల రాజ్యం నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
"ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిన ఈరోజు బ్లాక్ డే, ఆయన సీఎంగా ఉండగా ప్రజాస్వామ్యం డొల్లని రుజువైంది. చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు ఒట్టిమాటలే. ఈ ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించాలి" అని జగన్ డిమాండ్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



