గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ కుదేలు!

Sunday, February 3, 2019 10:30 AM Politics
గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ కుదేలు!

గుంటూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టి గెలుపు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా జిల్లా లో చాలా బలంగా ఉన్న "కాపు" ఫ్యాక్టర్ మరియు పవన్ కళ్యాణ్ గారి "జనసేన" ఈసారి తెలుగుదేశాన్ని కోలుకోలేని దెబ్బ తీయబోతుంది. ఈ ప్రభావం అన్ని పార్టిలమీద ఉన్నప్పటికీ తెలుగుదేశానికి ఎక్కువ నష్టం జరిగే పరిస్ధితులు క్షేత్రస్ధాయి లో స్పష్టంగా కనబడుతున్నాయి.

మొదటగా ఈ ప్రభావం ఎక్కువ కనబడుతున్న నియోజకవర్గాలు తెనాలి.. పొన్నూరు.. గుంటూరు-2.. బాపట్ల.. వేమూరు.. పెద్దకూరపాడు.. సత్తెనపల్లి.. మరియు విజయావకాశాలను ప్రభావితం చేయగల నియోజకవర్గాలు చిలుకులూరిపేట.. వినుకొండ.. మాచర్ల.

ఈసారి తెనాలిలో జరగబోతున్న త్రిముఖపోరు లొ ఈ వైసిపి(అన్నాబత్తిన శివకుమార్) జనసేన (నాదెండ్ల మనోహర్) తెలుగుదేశం(ఆలపాటి రాజా) మధ్య జరుగుతున్న హోరాహోరి పోరులో తెలుగు దేశం తృతియ స్ధానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని క్షేత్ర స్ధాయి లో తెనాలి టౌన్.. తెనాలి రూరల్.. కొల్లిపర మండలాలలోని బూతు లెవల్ వారీగా వాస్తవ పరిస్ధితులపై నాకు వచ్చిన సమాచారం. ఇదే కనుక జరిగితే తెనాలి సిట్టింగ్ స్దానాన్ని అధికార తెలుగుదేశం పార్టీ చేజార్చుకోవడం ఖాయం.

తెనాలి తరహ రాజకీయ సామాజిక పరిస్ధితులే బాపట్ల.. వేమూరు.. పొన్నూరు.. నియోజకవర్గాల్లో కనబడుతున్నాయి. పొన్నూరు శాసనసభ్యులు దూళిపాళ్ళ నరేంద్ర గారు కుంటుంబ మరియు ఆరోగ్య సమస్యల వల్ల మునుపుటిలా పూర్తి స్దాయి లో చురుగ్గా వ్యవహరించలేక పోవడం.. 35 వేల వరకు ఉన్న కాపు ఓటింగ్ లో డివిజన్ రావడం తొ పరిస్ధితులు క్లిష్టంగా మారాయి. (2009 లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్ధికి 30 వేల పైగా ఓట్లు సాదించారు) ఇదే కాపులలో డివిజన్ రావడం వల్ల బాపట్ల.. వేమూరు.. పెద్దకూరపాడు.. నియోజక వర్గాలలో కూడా అధికార పార్టి విజయావకాశాలు సన్నగిల్లాయి.

ఇక గుంటూరు తూర్పు(గుంటూరు-2) నియోజకవర్గం లో అయితే అసలు ప్రధాన పోటి వైసిపి జనసేన మధ్యే జరగబోతుంది. ఇక్కడ తెలుగుదేశానికి తృతియ స్ధానమే. అదేవిధంగా ఈసారి చిలకలూరిపేట.. మాచర్ల.. వినుకొండ.. నియోజకవర్గాలలో కాపు ఓటింగ్ లో వచ్చిన సరికొత్త మార్పు వల్ల అధికారపార్టి అభ్యర్ధుల తలరాతలు మారిపోయేలా ఉన్నాయి. గుంటూరు పశ్చిమం లో అయితే విచిత్రంగా తెలుగుదేశం వైసిపి జనసేన బిజేపి(కన్నా కనుక పోటి చేస్తే) 4 పార్టీల మధ్య హోరాహోరి పోరు తప్పేటట్టు లేదు.

పోయిన సారి కేవలం పవన్ కళ్యాణ్ ప్రభావం తోనే జీల్లాలోని 17 నియోజక వర్గాలలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 నుండి 5 వేల ఓట్లు తెలుగుదేశానికి అదనంగా పడ్డాయి. ఎవరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం. పైగా తెలుగుదేశం ఈ 17 నియోజకవర్గాలలో సాధించిన మెజారిటీలు కూడా 2 నుండి 7 వేల లోపే కావడం విశేషం.

అసలే రాజధాని ఉన్న జిల్లా.. అన్ని పార్టీలు ఈసారి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరి తలపడుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఈ జిల్లా లో ఆ పార్టి ఆశించిన స్ధాయి లో ఫలితాలు వచ్చే పరిస్ధితులు కనబడడంలేదు. అదే గనుక జరిగితే తెలుగుదేశం పార్టి అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కి 20-30 తక్కువ సీట్ల దూరంతో అధికారం కోల్పవడం ఖాయమయినట్టే..
- శ్రీధర్ రెడ్డిచల్లా

For All Tech Queries Please Click Here..!