మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధం?
Thursday, June 12, 2025 08:00 AM Politics
ఏపిలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నకిలీ పట్టాల పంపిణీలో కీలక సూత్రధారులుగా నాని, కిట్టు ఉన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలు పంపిణీ చేశారని, 10 వేల నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్ని నానిపై అభియోగాలు ఉన్నాయి.
నేపథ్యంలో ఏపీ హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గానీ, తన కుమారుడు ప్రమేయం గానీ లేదని హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)