మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండి: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
పదేళ్ల వరకూ ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నానని తెలిపారు. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండంటూ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని చెప్పారు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామన్నారు.
"ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కు చిన్నచూపు. పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంట్ లో నోరు ఎత్తకపోయినా కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపింది పాలమూరు జిల్లా. గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటి? నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 98 జీవో ప్రకారం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు? వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. పదేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేదా?" అని సీఎం రేవంత్ మండిపడ్డారు.

.jpg)
.jpg)
.jpg)