ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక

Thursday, August 21, 2025 09:30 AM Politics
ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక

పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయనున్నారు.

22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరునా అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు. అంబిక భక్త బృందం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు, భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు, చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు, ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట తరవాత వచ్చే ఆడపడుచులకు కూడా పవన్ కల్యాణ్ పంపించిన పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందించనున్నారు. మొత్తం 10 వేల మంది మహిళలకు ఈ కానుకలు అందించనున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: