రోజాకు కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్
Thursday, July 24, 2025 09:00 AM Politics
వైజాగ్ లో ఏర్పాటు చేసిన 'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్లో రోజాకు పరోక్షంగా పవన్ మాస్ కౌంటర్ ఇచ్చారు. బావిలో కప్పలా ఉండే వారికి తన విలువ తెలీదన్నారు. "నేను ఏ ఊరు వెళ్లినా అక్కడ పెరిగానని చెబుతూ ఉంటా.. నా పేరు పవన్.. పవనంలా తిరుగుతుంటా" అని అన్నారు.
కాగా ఇటీవల రోజా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఊగిపోయి సినిమా డైలాగులు చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత షూటింగ్లు, డబ్బింగ్‌లు చేసుకుంటూ తిరుగుతున్నారని రోజా దుయ్యబట్టారు. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా? డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్‌లు చేసుకోవడానికా అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు మతిస్థిమితం లేదని.. ఆయన ఏ ఊరు వెళ్లినా, అక్కడే పుట్టానని, అక్కడే పెరిగానని చెబుతాడని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)