నేను అందుకే పని చేస్తున్నా : పవన్‌ కల్యాణ్‌

Wednesday, December 5, 2018 03:53 PM Politics
నేను అందుకే పని చేస్తున్నా : పవన్‌ కల్యాణ్‌

25 కేజీల బియ్యం కాదని... 25 ఏళ్ల భవిష్యత్తు కోసం తాను పని చేస్తున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అనంతపురంలో జనసేన పవన్‌ ఆధ్వర్యంలో బుధవారం ' జనసేన తరంగం' మేనిఫెస్టో విడుదలైంది. ముందుగా మర్తాడులోని ఓ ఇంటికి వెళ్లిన పవన్‌ పార్టీ మేనిఫెస్టోను వారికి వివరించారు. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఫేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.కుల మతాలకు అతీతంగా ఏపి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

For All Tech Queries Please Click Here..!