అబద్ధాలలో అంబటికి ఆస్కార్ ఇవ్వొచ్చు: మంత్రి నిమ్మల

Monday, August 25, 2025 03:06 PM Politics
అబద్ధాలలో అంబటికి ఆస్కార్ ఇవ్వొచ్చు: మంత్రి నిమ్మల

పోలవరంపై చర్చకు సిద్ధమా అని అంబటి రాంబాబు చేసిన సవాలు సిగ్గుచేటని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాలు అతికినట్లు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.

పోలవరాన్ని పూర్తి చేయకుండా చేతులెత్తేశారని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటికి పోలవరం గురించి అర్థం కాలేదని, దిగువశ్రేణి నేతలకు ఉన్న అవగాహన కూడా ఆయనకు లేదని అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: