మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ
Wednesday, August 13, 2025 02:38 PM Politics
మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వెంటనే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని రాసుకొచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే నింపాలని కోరారు. అంతేకాక కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్-6 వద్ద మోటర్లను ఆన్ చేసి నీటి పంపింణి చేయాలని కోరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



