జగన్ ఘరానా మోసగాడు: సీఎం చంద్రబాబు

Saturday, August 2, 2025 09:44 AM Politics
జగన్ ఘరానా మోసగాడు: సీఎం చంద్రబాబు

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఘరానా మోసగాడని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. సొంత మీడియా సంస్థలైన సాక్షి పత్రిక, సాక్షి టీవీలను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సాక్షి మీడియాను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని ఆయన హెచ్చరించారు. మహిళను బూతులు తిడితే మందలించాల్సింది పోయి ఇంకా తిట్టమని ప్రోత్సహిస్తున్నాడని సీఎం ద్వజమెత్తారు.

బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటన దృశ్యాలతో కలిపి భారీగా జనం వచ్చినట్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి, అసౌకర్యం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: