ఉచిత బస్సుల్లో ఎక్కడికి వెళ్లాలి: మాధవీలత
Monday, August 18, 2025 10:00 AM Politics
తెలంగాణలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన మహాలక్ష్మి పథకంపై బిజెపి నాయకురాలు మాధవీ లత మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు ఊదర గొడుతున్న ఫ్రీ బస్సు సర్వీసులో ఎక్కడికి వెళ్లి తిరిగి రావాలని అన్నారు. టిఫిన్ డబ్బా పట్టుకుని, బస్సుల్లో తిరిగి బస్సుల్లోనే తిని అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



