గ్లామరస్ హీరోయిన్‌కు గుంటూరు ఎమ్మెల్యే టికెట్..

Tuesday, March 19, 2019 12:15 PM Politics
గ్లామరస్ హీరోయిన్‌కు గుంటూరు ఎమ్మెల్యే టికెట్..

మాధవీలత.. 'నచ్చావులే' సినిమా ద్వారా.. తెలుగు సినిమాకు పరిచయమైన విషయం తెలిసిందే. రవిబాబు దర్మకత్వం వహించిన ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు. ఆ సినిమా ద్వారా మాధవీలత మంచి పేరు తెచ్చుకున్నారు.  అయితే అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఆ తర్వాత నాని హీరోగా స్నేహితుడా..సినిమాలో నటించారు మాధవీలత. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసినా..సరైన గుర్తింపు రాలేదు. ఆ మధ్య మీటూ ఉద్యమంలో కూడ తన గళాన్ని వినిపించారు. 

అంతేకాకుండా మాధవీలత కొన్నాళ్లుగా బీజేపీ తరఫున గళం వినిపిస్తున్నారు.  దీంతో పార్టీ.. మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించింది. అందులో భాగంగా.. బీజేపీ అధినాయకత్వం ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాధవీలత పేరు ఖరారు చేశారు.  మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత.. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసి.. అనంతరం తెలుగు చిత్ర సీమలో ప్రవేశించి.. పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

For All Tech Queries Please Click Here..!