టైటానిక్ విషాదం గురించి నమ్మశక్యంగాని కొన్ని నిజాలు

Wednesday, January 30, 2019 01:00 PM Offbeat
టైటానిక్ విషాదం గురించి నమ్మశక్యంగాని కొన్ని నిజాలు

ప్రపంచంలోకెల్లా అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో టైటానిక్ ప్రమాదం ఒకటి. అవును ఈ ఘోర సంఘటన జరిగి వందేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ప్రమాదాన్ని ఇప్పటికీ మరిచిపోలేం. బావితరాలకు ఎన్నో మధుర స్మృతులను ఇవ్వాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణంలోనే ప్రమాదానికి గురయ్యి సముద్రంలో మునిగిపోయింది.

ఇవాళ్టి స్టోరీలో టైటానిక్ గురించి వెలుగులోకి రానటువంటి ఎన్నో నమ్మశక్యంగాని నిజాలను తెలుసుకుందాం రండి...

1. టైటానిక్ షిప్ సముద్రంలోని మంచు పర్వతాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో సుమారుగా 700 మందికి పైగా మరణించారు.

2. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద నౌకగా టైటానిక్ ప్రఖ్యాతిగాంచింది. టైటానిక్ నౌక పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు మరియు ఎత్తు 175 అడుగులు. సుమారుగా 66,000 టన్నుల నీటిని ప్రక్కకు నెట్ట గల సామర్థ్యం టైటానిక్ సొంతం.

3. టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతి పెద్ద మంచు కొండను చూసి టైటానిక్‌లో ఉన్న అధికారులు విస్తుపోయారు. టైటానిక్ మంచు కొండను ఢీ కొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందు మాత్రమే గుర్తించినట్లు సమాచారం.

4. ఆ మంచు పర్వతాన్ని తప్పించేందుక టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని మరియు ఇంజన్‌లను రివర్స్‌లో రన్ చేయమని ఇంజన్‌ రూమ్‌ అధికారులను టైటానిక్ ఆఫీసర్ మర్డోచ్ ఆదేశించాడు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగం మంచు పర్వతాన్ని బలంగా ఢీకొట్టింది.

5. ప్రమాదం జరిగిన రోజు టైటానిక్ నౌకలో ఉన్న 2,200 మందిని రక్షించడానికి  కావాల్సిన లైఫ్ బోట్లు అందుబాటులో లేవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షిస్తారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు స్పష్టంగా వెల్లడించారు.

6. ప్రమాదం జరిగిన రోజు ప్రయాణికులందరనీ సమావేశానికి హాజరవ్వాలని టైటానిక్ షిప్ క్యాప్టెన్ స్మిత్ ఆదేశించారు. ఈ సమావేశానికి వెళితే లైఫ్‌బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయడపడవచ్చో తెలుసుకోవచ్చని ప్రయాణికులు భావించారు. అయితే, అనుకోకుండా లైఫ్‌బోట్ సమావేశం రద్దు చేశాడు.

7. సమావేశానికి అందరూ హాజరవ్వాలని ఆదేశించి క్యాప్టెన్ స్మిత్ అతి పెద్ద పొరబాటు చేశాడు. అందరూ సమావేశానికి వెళ్లడంతో లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడంతో కొన్ని బోట్లలో పరిమితి కంటే తక్కువ మందిని మాత్రమే సురక్షితంగా బయటకు పంపించారు.

8. లైఫ్‌సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్న పిల్లలను మాత్రమే తరలించడం ప్రారంభించారు. ప్రయాణికులను ఒడ్డుకు పంపుతున్న ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో చాలా వరకు బోట్ల కొద్ది మంది ప్రయాణికులతో మాత్రమే ఒడ్డుకు వెళ్లాయి.

9 .టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం 328 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 119 దేహాలు తీవ్రంగా కుళ్లిపోవడంతో వాటిని వెనక్కి తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్లు తెలిపారు.

10. టైటానికి షిప్ ప్రమాదం అతి పెద్ద విషాదంగా మిగిలిపోయింది. అయితే, చాలా వరకు నమ్మశక్యంగానీవి ఇందులో ఉన్నాయి. టైటానికి షిప్‌లో 700 మంది ప్రయాణించే థర్డ్ క్లాస్‌లో కేవలం రెండు బాత్ టబ్బులు మాత్రమే ఉన్నాయి. కానీ, ఫస్ట్ క్లాస్‌లో ప్రతి గదికీ ఓ బాత్‌రూమ్ ఉంది.

11. టైటానిక్ నౌక ఇంగ్లాండ్ పోస్టల్ సర్వీస్ యొక్క అధికారిక పోస్టల్ రవాణా నౌకగా ఉండేది. టైటానిక్ షిప్‌లో కూడా ఓ పోస్ట్ ఆఫీస్ ఉండేది. అందులో ముగ్గురు అమెరికా ఉద్యోగులు మరియు ఇద్దరు ఇంగ్లాండు ఉద్యోగులు పనిచేసే వారు.

12. ఇరు దేశాల మధ్య జరిగే పోస్టల్ సర్వీసుల్లో భాగంగా టైటానిక్ నౌకలో ఉన్న ఉద్యోగులు సుమారుగా 70 లక్షల న్యూస్ లెటర్లు గల 3,423 పోస్టల్ సంచులను నిర్వహించేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మునిగిపోయిన టైటానిక్ నుండి అన్ని ఉత్తరాలను తిరిగి సేకరించారు.

13. టైటానిక్ షిప్ మునిగిపోయిన 73 సంవత్సరాల అనంతరం , సెప్టెంబర్ 1, 1985లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్‌ను గుర్తించాడు.

14. సముద్ర ఉపరితలం నుండి రెండు మైళ్ల లోతులో టైటానిక్ నౌక ఉంది. మునిగిపోయిన టైటానిక్ షిప్ ప్రస్తుతం యూనెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది.

15. టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా టైటానిక్ ప్రమాదానికి గురయ్యి, తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఏదేమైనప్పటికీ, పెద్ద పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెబుతుంది.

For All Tech Queries Please Click Here..!