భర్త వద్దని.. ప్రియుని చెంతకు..

Friday, July 18, 2025 08:44 PM News
భర్త వద్దని.. ప్రియుని చెంతకు..

ఓ యువతి ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చింది. విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ తండ్రి బెంగళూరులో కాంట్రాక్టర్ గా పని చేసేవాడు. అతని వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం సాగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్ ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. 

కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను ప్రియునితోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుని కూర్చుంది. ఈ కహానీ ఎక్కడ ఎండ్ అవుతుందో మరి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: