రైల్లో చైన్ లాగిన యువకుడు.. కారణం తెలిసి అందరూ షాక్..

ఢిల్లీ-ఆగ్రా రూట్‌లో మధుర జంక్షన్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. రైలు మధుర జంక్షన్ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు తమ తమ సీట్లలో సెట్ అవుతున్నారు. కొంతమంది నెక్ట్స్ స్టేషన్‌లో తాము దిగాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఓ కుర్రాడు తాను కూర్చున్న చోటి నుంచి ఒక్కసారిగా లేచాడు. వెంటనే చైన్ లాగేశాడు. రైలు ఆగిపోయింది. గబగబా దిగిపోయాడు. దిగిపోయి మిగతా ప్రయాణికులవైపు భయం భయంగా చూస్తూ ఉన్నాడు. అది గమనించిన మిగతా ప్రయాణికులు దిగి అతన్ని పట్టుకున్నారు. ఎందుకు చైన్ లాగావు? ఏమైంది? అని అడిగారు. ఇంతలో అటుగా రైలుకు సంబంధించిన అధికారులు (GRP), రైల్వే రిజర్వ్ పోలీసులూ (RPF) అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులు అతన్ని పట్టుకొని గట్టిగా అడిగితే. చైన్ ఎందుకు లాగాడో చెప్పాడు. దాంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఎలా స్పందించాలో వారికి అర్థం కాలేదు. అతను చెప్పిన కారణంతో వారికి దిమ్మ తిరిగింది.
అతను మరోసారి వాళ్లవైపు భయం భయంగా చూస్తూ అందరూ రైలు దిగిపోండి.. ముందే చెబుతున్నా.. దిగిపోండి అని అరిచాడు. దాంతో అధికారులకు ఆశ్చర్యం వేసింది. మళ్లీ అతన్ని గట్టిగా పట్టుకొని నిలదీశారు. అప్పుడు అతను తాను ఎందుకు చైన్ లాగిందీ, ఎందుకు అందర్నీ దిగిపోమంటున్నదీ చెప్పడంతో ఆ అధికారులకు కూడా దిమ్మ తిరిగింది. అతను బీహారీ జీని సందర్శించి రైల్లో రిటర్న్ వస్తున్నాడు. అతను రైలులో కూర్చున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికి చెడ్డ కల వచ్చింది. రైలు ప్రమాదం జరిగినట్లు, పట్టాలు తప్పినట్లు కలవచ్చింది. అప్పుడే మెలకువ వచ్చింది. దాంతో వెంటనే చైన్ లాగేసి రైలు దిగిపోయాడు. ఇదే విషయాన్ని అతను చెప్పడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అధికారులకు అర్థం కాలేదు. సరైన కారణాలు లేకుండా ఇలా చైన్ లాగొద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అతని వివరాలు తీసుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయాణికులు సరైన కారణం లేకుండా చైన్లు లాగుతున్నారని, దీని వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయని, ఇటీవల ఇలాంటి 372 మందిపై చర్యలు తీసుకున్నామనీ, వారి నుంచి రూ.15,540 జరిమానా రూపంలో వసూలు చేశామని ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు.