తండ్రి శవం ముందే లవర్ కు తాళి కట్టిన యువకుడు.. వీడియో వైరల్
Saturday, April 19, 2025 03:35 PM News

ప్రతి తండ్రికీ తన కళ్లముందు కొడుకు పెళ్లి జరగాలని, మనవడు,మనవరాళ్లతో ఆడుకోవాలని కోరికగా ఉంటుంది. ఆ కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు.దీంతో ఆ కొడుక్కితీరని వేదన మిగిల్చింది.
అంత్యక్రియలకు ముందే తన తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తన ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ముందు ఆమెకు తాళి కట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. అక్కడికి వచ్చిన బంధువులు, స్థానికులు వారిని పుట్టెడు దుఃఖంలోనూ ఆశీర్వదించారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: