7న యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం మూసివేత
Sunday, August 31, 2025 08:27 AM News
ఈ నెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కైంకర్యాలు, నివేదన నిర్వహించి ద్వార బంధనం చేయనున్నట్లు వెల్లడించారు.
మరుసటి రోజు వేకువ జామున 3.30 గంటలకు ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పర్వాలు చేపట్టి, నిత్య ఆరాధనలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



