ఎమిశాట్ ఉపగ్రహం యొక్క ఉపయోగాలు..!

Tuesday, April 2, 2019 12:30 PM News
ఎమిశాట్ ఉపగ్రహం యొక్క ఉపయోగాలు..!

మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో ఎమిశాట్‌ ఉపగ్రహంను అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహం ఎంతో అధునాతనమైన నిఘా ఉపగ్రహం. ఇస్రో మరియు డీఆర్‌డీఓకు చెందిన శాస్త్రవేత్తలు ఐదేండ్ల కృషి ఈ ఉపగ్రహం అని చెప్పవచు. అత్యంత సున్నితమైన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ ఉన్న ఈ ఉపగ్రహం శత్రుదేశాల రాడార్లపై నిఘా పెట్టగలదు. శత్రుదేశాల రాడార్ల నుంచి వెలువడే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలను గుర్తించి, వాటిని అడ్డుకుంటుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను అందిస్తుంది.

ఈ ఉపగ్రహం ద్వారా శత్రుదేశాలు ఎటువంటి రాడార్‌ను, ఎంతదూరంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు. శుత్రుదేశాలపై నిఘా వేయడానికి గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఎమిశాట్ రాకతో 24 గంటలూ నిగా వేసే అవకాశం లభించింది. నౌకలలోని రాడార్ల నుంచి వెలువడే రేడియో సంకేతాలను కూడా ఎమిశాట్ అడ్డుకోగలదని ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఈ ఉపగ్రహం రాకతో మన ఢిఫన్స్ కు చాలా ఉపయోగాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో ఏ దేశమైనా తొలుత శత్రుదేశాల సమాచార వ్యవస్థలను, స్థావరాలను ధ్వంసం చేస్తుంది. అప్పుడు శత్రువుకు సరైన లక్ష్యాలు తెలియకుండా దాడి చేయడం కుదరదు. అందుకే ముందు శత్రువుల కమ్యూనికేషన్ స్థావరాలు, రాడార్ వ్యవస్థలను గుర్తించే వ్యవస్థ అత్యవసరం. ఇప్పుడు ఎమిశాట్‌ను ఈ అవసరం కోసమే ప్రయోగించినట్టు తెలుస్తున్నది. 436 కిలోల బరువున్న ఎమిశాట్‌ను తయారుచేయడానికి రూ.432 కోట్లు వచ్చించారు .

For All Tech Queries Please Click Here..!