స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు తీర్పు
Wednesday, June 25, 2025 08:38 AM News
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్లు వాదనలు వినిపించారు. 30 రోజుల గడువుకావాలని కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆ నేపథ్యంలో నేడు తీర్పు ఇవ్వనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



