2 గంటల్లో రూ.6 కోట్ల జాక్ పాట్ కొట్టిన కూరగాయల వ్యాపారి
Friday, May 2, 2025 12:00 PM News

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. అది వరించిన నాడు.. ఆనందానికి అవదులే ఉండవు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా కక్కోన్ గ్రామానికి చెందిన 68 ఏళ్ల తర్సేమ్ లాల్ ను అదృష్టం వరించింది. రూ.500తో లాటరీ టికెట్ కొంటే.. 2 గంటల్లోనే రూ.6 కోట్ల జాక్ పాట్ తగిలింది. ప్రస్తుతం కూరగాయల వ్యాపారం చేస్తూ అద్దెంట్లో ఉంటున్నాడు.
మొదట తనకి రూ.6 కోట్ల లాటరీ తగిలిందన్న విషయాన్ని తర్సేమ్ లాల్ నమ్మలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ మేరకు అతడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత 15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నట్లు తెలిపాడు. ఏదో ఒక రోజు తనకు లాటరీ తప్పకుండా తగులుందనే నమ్మకంతో తాను ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వచ్చిన డబ్బులతో సొంతిల్లు కొనుక్కుంటానని అన్నాడు
.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: