ఉత్తరాఖండ్‌లో మంచుచరియ ప్రమాదంలో ముగిసిన రెస్కూ ఆపరేషన్, ఎనిమిది మంది మృతి

Monday, March 3, 2025 12:16 PM News
ఉత్తరాఖండ్‌లో మంచుచరియ ప్రమాదంలో ముగిసిన రెస్కూ ఆపరేషన్, ఎనిమిది మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియ విరిగిపడి 54 మంది BRO కార్మికులు చిక్కుకున్న సంగతి విదితమే. 60 గంటల పాటు సాగిన సహాయక చర్యల్లో 46 మందిని రక్షించగా, ఎనిమిది మంది మృతి చెందారు. అందులో నలుగురి మృతదేహాలను ఆ రోజే వెలికి తీయగా మిస్సయిన మరో నలుగురి మృతదేహాలను BRO ఈ రోజు వెలికి తీసింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయినట్లు అధికారుల ప్రకటించారు.  గాయపడిన 46 మందిని జ్యోతిర్మఠ్ సైనిక ఆసుపత్రికి తరలించగా, ఇద్దరిని రిషికేశ్ ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, సహాయక బృందాల ధైర్యసాహసాలను ప్రశంసించారు. భవిష్యత్తులో హిమపాతం ప్రభావాన్ని తగ్గించేందుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూపొందించేందుకు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మనా – బద్రీనాథ్ మార్గంలోని BRO శిబిరంపై మంచుచరియ విరిగిపడటంతో ఎనిమిది కంటైనర్లు, ఒక షెడ్‌ దెబ్బతిన్నాయి. సహాయ చర్యల్లో NDRF, SDRF, ITBP, IAF, BRO, జిల్లా యంత్రాంగంతో పాటు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్స్, థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో శోధన చర్యలు చేపట్టారు. మానా గ్రామం, భారతదేశం-టిబెట్ సరిహద్దులో సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. భారత్ చివరి స్థావరం కూడా ఇదే..


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: