ఏపిలో వారికి నిరుద్యోగ భృతి
_(22)-1745387987.jpeg)
ఏపిలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సమయంలో ఎన్నో హామీలను ఇచ్చినా హామీలను నెరవేర్చలేదు. దీంతో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా ఇప్పుడు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల రూ.3వేల చొప్పున నిరుద్యోగులకు భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు వీరిలో వర్గీకరణ చేసి కొంతమందికి అమలు చేసే విధంగా ఏపీ సర్కార్ నిధులను విడుదల చేసింది. ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
బ్రాహ్మణులు తమ మతపరమైన విద్యను కూడా అభ్యసించి ఖాళీగా ఉన్నారు. దైవ కార్యక్రమలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారందరికీ కూడా ఈ పథకాన్ని ఇచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను కూడా విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి ధ్రువీకరణ పత్రం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి రూ.3 వేలు అందిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా యువ పండితులు 599 మంది మాత్రమే ఉన్నారు. ఎవరైనా ఈ లిస్టులో కనుక తమ పేరు లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అవకాశం కల్పిస్తోంది. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి డబ్బులను కూడా విడుదల చేశారు.