ఐపీల్ చరిత్రలో టాప్ స్కోరర్లు...!

Wednesday, March 20, 2019 04:00 PM News
ఐపీల్ చరిత్రలో టాప్ స్కోరర్లు...!

ఐపీఎల్ ఇంత హిట్ అవటానికి కారణం బౌండరీలను శాసించే బ్యాట్స్‌మెన్‌లు, రెప్పపాటున వికెట్లు పడగొట్టే బౌలర్లు. 20-20 క్రికెట్ ఫార్మాట్‌ను బ్యాటింగ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. దూకుడైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్‌ల వీర బాదుడికి రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా మీకోసం.

క్రిస్ గేల్:- 175 నాటౌట్

విధ్వంసకర వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రికార్డు ని నెలకొలిపాడు, పూణే వారియర్స్ పైన 66 బంతుల్లో 175 పరుగులు సాధించాడు.

బ్రెండన్ మెక్‌కల్లమ్:- 158 నాటౌట్  

విధ్వంసకర న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కల్లమ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రికార్డు ని నెలకొలిపాడు, రాయల్ ఛాలెంజర్స్ పైన 73 బంతుల్లో 158 పరుగులు సాధించాడు.

ఏబీ డివిలియర్స్:- 133 నాటౌట్

విధ్వంసకర దక్షిణాప్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రికార్డు ని నెలకొలిపాడు, ముంబై ఇండియన్స్‌ పైన 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు.

ఏబీ డివిలియర్స్:- 129 నాటౌట్

విధ్వంసకర దక్షిణాప్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్ ఈ రికార్డు ని నెలకొలిపాడు, గుజరాత్ లయన్స్‌ పైన 52 బంతుల్లో 129 పరుగులు సాధించాడు.

రిషబ్ పంత్:- 128 నాటౌట్

ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతుంటే భారత క్రికెటర్లు మాత్రం సెంచరీ మార్క్‌తో సరిపెట్టేస్తూ వచ్చారు,2018 ఐపీఎల్‌ సీజన్‌లో భారత్‌ నుంచి కూడా ఓ పవర్‌ హిట్టర్ వెలుగులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పైన 63 బంతుల్లో 128 పరుగులు సాధించాడు.

For All Tech Queries Please Click Here..!