శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
Monday, August 25, 2025 04:32 PM News
శంషాబాద్ విమానాశ్రయం నుంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని ఏర్పాటు చేసింది. ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలంకి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు https://tgsrtcbus.in వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



