10,945 ప్రభుత్వ ఉద్యోగాలు
_(14)-1745056323.jpeg)
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులను మంజూరు చేసింది. మొత్తం10,954 జీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీపీవో జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. మొదట వీఆర్‌ఏ, వీఆర్‌వోలలో అర్హులైన వారిని గుర్తించి తీసుకోవాలని భావించింది. ఈ మేరకు గ్రామ పాలన అధికారులుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారిని కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది.
మొత్తంగా 7 వేల మందికి అర్హతలు ఉన్నట్టు తెలిసింది. వీరికి ప్రవేశ పరీక్షలు నిర్వహించి, జీపీవోలుగా నియామించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కొత్త పోస్టుల కారణంగా తమ పాత సర్వీస్ కోల్పోతామని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు పలు సర్దుబాట్లపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీవోల నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.