టీసీఎస్ లో భారీగా ఉద్యోగాల కోత.. 12 వేల మందికి పైగా ఇంటికి...

Sunday, July 27, 2025 10:51 PM News
టీసీఎస్ లో భారీగా ఉద్యోగాల కోత.. 12 వేల మందికి పైగా ఇంటికి...

ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12000 మందిని పైగా ఇంటికి పంపనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈవో కె.కృతివాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు.

కొత్త సాంకేతికతలను మరీ ముఖ్యంగా ఏఐ, ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నామని, పనిచేసే విధానాలూ మారుతున్నాయనీ ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం కావాలని తెలిపారు. అందుకోసం ఏఐని వినియోగిస్తూ.. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2శాతం మందిపై దీని ప్రభావం పడుతుందని, ప్రధానంగా మధ్యస్థ, సీనియర్ స్థాయిల్లో ఉద్యోగాలపై ఎఫెక్ట్ ఉంటుందని వెల్లడించారు. సీఈవోగా తాను తీసుకొంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటని చెప్పారు. బలమైన టీసీఎస్ నిర్మాణంలో భాగంగా తాము తీసుకోవాల్సిన అతి కఠిన నిర్ణయాల్లో ఇదొకటని అన్నారు. లేఆఫ్ లు ఇచ్చినా సాధ్యమైనంత రీతిలో ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందన్నారు. టీసీఎస్ లో జూన్ తో ముగిసిన తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. అందువల్ల 2 శాతం ఉద్యోగాల తగ్గింపు నిర్ణయంతో దాదాపు 12,200 మందిపై ప్రభావం పడనుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: