12 నెలలుగా జీతం ఇవ్వడం లేదని TCS ఆఫీస్ ముందు దీక్షకు దిగిన ఉద్యోగి
Monday, August 4, 2025 02:18 PM News
పూణేలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం ఎదుట జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూలై 2024 నుంచి జీతం జమ కాలేదని ఆరోపిస్తూ ఓ ఉద్యోగి కార్యాలయం ముందు పడుకొని నిరసన తెలిపాడు. జీతం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని హైలెట్ చేస్తూ ఒక నోట్ కూడా రాసి ప్రదర్శించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ఈ నిరసన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 70 గంటలకు పైగా పని చేయించుకునే టీసీఎస్ వంటి పెద్ద కంపెనీ, తమ ఉద్యోగులను ఇలాంటి దారుణమైన పరిస్థితిలోకి నెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "టీసీఎస్ బీ లైక్ నో శాలరీ, నో షెల్టర్.. శాడ్ అండ్ టెర్రిబుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



